హుజూరాబాద్ పోరుని మారుస్తున్న ఈటల..అసలు కాన్ఫిడెన్స్ ఏంటి?  

-

హుజూరాబాద్‌లో రాజకీయ పోరు పూర్తిగా మారిపోతున్నట్లే కనిపిస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా పోరు నడుస్తున్నట్లు కనిపించడం లేదు. కేవలం ఈటల వర్సెస్ కేసీఆర్ అనేలాగా పోరు నడుస్తోందని చెప్పొచ్చు. అయితే ఈటల వ్యూహం కూడా ఇలాగే కనిపిస్తోంది. మొదట నుంచి టీఆర్ఎస్ ఇక్కడ బీజేపీనే హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి అసలు బలం లేదు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

హుజూరాబాద్‌లో వ్యక్తుల మధ్య ఫైట్ జరగడం లేదని, కేవలం పార్టీల మధ్య జరుగుతుందని కేటీఆర్ లాంటి వారు మాట్లాడారు. అటు కేసీఆర్ సైతం…ఈటలని చిన్న మనిషి అనే విధంగా మాట్లాడారు. అంటే ఇక్కడ ఈటలని సైడ్ చేసి, బీజేపీతో పోరు అని హైలైట్ చేస్తే అది టీఆర్ఎస్‌కు లబ్ది జరుగుతుందని కేసీఆర్ ప్లాన్‌గా తెలుస్తోంది.

కానీ కేసీఆర్ వ్యూహాలకు ఈటల ఎప్పటికప్పుడు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తాను చిన్నమనిషిని అవునో, కాదో తెలియాలంటే కేసీఆర్ తన మీద పోటీ చేయాలని ఈటల సవాల్ విసిరారు. దమ్ముంటే కేసీఆర్ తన మీద పోటీ చేసి గెలవాలని, లేదంటే హరీష్ పోటీ చేసిన ఓకే అంటూ ఈటల సవాల్ చేశారు. మరి ఇలా సవాళ్ళు విసురుతున్న ఈటలకు గెలుపుపై బాగా కాన్ఫిడెన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు కేసీఆర్, ఈటలని కావాలనే బయటకు పంపించారనే సానుభూతి హుజూరాబాద్ ప్రజల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే కేసీఆర్‌తోనే తనకు పోటీ అనే విధంగా ఈటల ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అప్పుడే ఇంకా తనకు మద్ధతు పెరుగుతుందని భావిస్తున్నారు. అంటే టోటల్‌గా హుజూరాబాద్ పోరుని కేసీఆర్ వర్సెస్ ఈటలగా మార్చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version