రెయిన్ ఎఫెక్ట్:ఈ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించిన స్థానికులు…!

-

హైదరాబాద్‌లో నేతలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. వరదలతో అల్లాడుతున్న తమను పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యేలపై జనం మండిపడుతున్నారు. మూడురోజులుగా నీళ్లలోనే నరకం చూస్తుంటే కనీస సాయం అందించడం లేదంటూ ఆగ్రహం చెందుతున్నారు. అనుకోని విపత్తు ముంచెత్తినా, ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీస్తున్నారు.

హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి షాక్‌ ఇచ్చింది మహిళ. సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీసింది. మూడ్రోజులుగా తిండీతిప్పలు లేకుండా నరకం చూస్తున్నామని మండిపడింది. మేం బతకాలా..? చావాలో చెప్పండి అంటూ ఎమ్మెల్యేను ఆవేదన వ్యక్తం చేసింది. ఊహించని పరిణామంతో షాక్‌ తిన్న సుభాష్ రెడ్డి… నీళ్లల్లో ఇళ్లు ఎవరు కట్టుకొమ్మన్నారంటూ ఎదురు దాడికి దిగారు. ఐతే ఇళ్లు పర్మీషన్‌ ఎవరిచ్చారంటూ ఆమె నిలదీయడంతో ఎమ్మెల్యే నోట మాట రాలేదు.

అమీన్‌పూర్‌లో కూడా స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులను నిలదీశారు. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చినా… అధికారులు పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారంటూ మండిపడుతున్నారు అమీన్‌పూర్‌వాసులు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకు కూడా అటువంటి చేదు అనుభవమే ఎదురైందది. మేడిపల్లి గ్రామంలో వర్షాలతో పాడైన పంటలను పరిశీలించడానికి వస్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు రైతులు. MLA మంచి రెడ్డి కిషన్ రెడ్డి తమ గ్రామానికి రావద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news