ఖలిస్తానీ ఉగ్రవాదులపై పోరాటం చేసిన మాజీ ఆర్మీ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. బల్విందర్ సింగ్ ఉగ్రవాదులపై పోరాటంలో ప్రసిద్ది చెందారు. ఆయనను శుక్రవారం తెల్లవారుజామున తన గ్రామంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఆయన వయసు 62 ఏళ్ళు అని పోలీసులు చెప్పారు. భికివింద్ కు చెందిన బల్విందర్ సింగ్ సంధు 1980 లు మరియు 90 ల ప్రారంభంలో ఉగ్రవాద ప్రభావిత టార్న్ తరన్ జిల్లాలో ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఆయన పోరాటం చేసారు.
ఆయనపై అనేక సార్లు దాడి చేసారు. అయినా సరే ఆయన మాత్రం ఉగ్రవాదులను ఎదుర్కొన్నాడు. ఆయన గ్రామంలో గతంలో భారీగా ఉగ్రవాదులు ఉండే వారు. అయితే మోటారు సైకిళ్లపై వచ్చిన సాయుధ దుండగులు ఆయనను చంపారు అని అధికారులు పేర్కొన్నారు. ఆయన స్కూల్ లో వేచి ఉండగా కాల్చి చంపేశారు.