జంట పేలుళ్ల కేసులో ఉరి శిక్ష విధించిన కోర్టు

-

తీర్పు వెలువరించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు

గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసులో దోషులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేరస్తులకు ఆశ్రయం కల్పించిన అంజున్ కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 4న అనీఖ్ షఫీక్ సయీద్, మహమ్మద్ ఇస్మాయిల్ లను న్యాయస్థానం దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే..

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితుల్లో అనీఖ్ సయీద్,  మహమ్మద్ ఇస్మాయిల్ లను గత మంగళవారం దోషులుగా నిర్థారించిన కోర్టు, మరో నిందితుడు అంజూమ్ ను సైతం దోషిగా తేల్చింది. ఈ ముగ్గురిపై హత్య, కుట్ర, దేశంపై తీవ్రవాద పద్ధతిలో తిరుగుబాటు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు తదితర కేసుల్లో విచారణ చేపట్టి తుది తీర్పుని వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందు వల్ల సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూఖ్ షర్ఫుద్ధీన్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాస్త లేటైనా న్యాయస్థానం సరైన నిర్ణయం తీసుకుంది అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news