శెభాష్.. హీరోల్లా వచ్చి బాల్కనీకి వేలాడుతున్న పాపను కాపాడారు..!

-

వాళ్లు స్పైడర్ మెనా అస్సలు కాదు.. మరి.. సూపర్ మెన్.. కానే కాదు.. మరి.. బ్యాట్స్ మెన్.. కాదు.. మరి ఎవరు.. సామాన్య యువకులు. అంతే.. కానీ.. స్పైడర్, సూపర్, బ్యాట్స్.. ఇలా అందరి మెన్ ల కన్నా దైర్యం చేశారు. ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏం జరిగిందంటే…

ఓ పాప.. ఇంట్లో నిద్రపోతుంటే తన తండ్రి తాళం వేసి బయటికి వెళ్లాడట. తన తండ్రి వెళ్లాక ఆ పాపకు మెలుకువ వచ్చింది. దీంతో ఏడుస్తూ బయటకు వస్తూ జారి పడి బాల్కనీలో పడిపోయి బాల్కనీని పట్టుకొని వేలాడుతోంది. అది నాలుగో ఫ్లోర్. అక్కడినుంచి పడితే ఏమైనా ఉందా? బాల్కనీకి వేలాడుతున్న పాపను ఇద్దరు డెలివరీ బాయ్స్ గమనించారు. అంతే.. తమ డెలివరీ పనిని అక్కడే వదిలేసి.. చకచకా స్పైడర్ మెన్ లా గోడలు పాకుతూ పైకి చేరుకున్నారు. పాప వేలాడుతున్న బాల్కనీకి చేరుకొని పాపను కాపాడారు. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన చైనాలోని జియాంగ్సూ రాష్ట్రంలోని చాంగ్ షూలో చోటు చేసుకున్నది.

ఇక.. ఈ ఘటనను ఆ బిల్డింగ్ కు ఎదురుగా ఉండే బిల్డింగ్ లోని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు పాపను కాపాడిన డెలివరీ బాయ్స్ ను హీరోలతో పోల్చుతూ తెగ మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news