Hyderabad:నగరవాసులకు తప్పనున్న ట్రాఫిక్ ఇబ్బందులు

-

నగరంలో భారీ వర్షాలకు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది . సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్.. ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీసు ప్రాంతాలను పరిశీలించారు.

వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో అధిక మెుత్తం నీరు నిల్వ ఉండి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు 10లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులను నిర్మించనున్నట్లు దాన కిషోర్ తెలిపారు. నగరంలో గుర్తించిన 140 వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో సంపులు నిర్మించేందుకు స్థలాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్ సర్కిళ్లలో రూ.20కోట్లతో మొత్తం 11ప్రాంతాల్లో 10లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు నిర్మిస్తామని ఆయన తెలిపారు. వర్షం కురిసే సమయంలో సంపుల్లోకి నీటిని సేకరించి.. తర్వాత సమీపంలో ఉన్న నాలాల్లోకి పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు దాన కిషోర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news