ఇలా జీర్ణ సమస్యలని సులభంగా తగ్గించుకోండి..!

-

చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ చిన్న చిన్న ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. కాన్స్టిపేషన్, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. జీర్ణ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి.

పుదీనా టీ:

మీకు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తే పుదీనా టీ మీకు బాగా సహాయం చేస్తుంది. పెప్పర్ మెంట్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. డైజెస్టివ్ సిస్టం లో ఉండే మజిల్స్ ని ఇది రిలాక్స్ గా ఉంచుతుంది. అదే విధంగా కాన్స్టిపేషన్, మోషన్ సిక్నెస్ వంటి సమస్యలు కూడా పుదీనా టీ తో మాయమైపోతాయి.

పెరుగు:

కడుపు నొప్పి మొదలైన సమస్యలకు మంచి రిలీఫ్ ఇస్తుంది పెరుగు. ఇది ప్రోబయోటిక్ కాబట్టి చక్కటి ప్రయోజనాన్ని ఇస్తుంది. అతిగా తిన్నా కూడా ఇది మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. కాబట్టి తాజా పెరుగును మీ డైట్ లో తీసుకోవడం మంచిది.

చల్లటి పాలు తాగండి:

పాలల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది హైడ్రో క్లోరిక్ యాసిడ్ ని సెక్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనితో మంచి రిలీఫ్ వస్తుంది.

పుచ్చకాయ:

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. నీళ్లు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా సమస్యలు పుచ్చకాయతో చెక్ పెట్టొచ్చు.

కాసేపు నడవండి:

తినేసిన తర్వాత నెమ్మదిగా ఒక పదిహేను నిమిషాల పాటు నడిస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది కాబట్టి తినేసిన తర్వాత కాసేపు నడవండి.

Read more RELATED
Recommended to you

Latest news