ఖాళీ అయిపోయిన హైదరాబాద్…!

-

దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సంగతి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుంది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎక్కడికక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ ,నెల్లూరు నగరంలో నివసించే ఉద్యోగులు విద్యార్థులు అందరూ కూడా తమ తమ సొంత ఊళ్లకు వెళ్లి పోతున్నారు. హైదరాబాద్ నగరంలో చదువుకునే విద్యార్థులు అలాగే పనిచేసే చిన్నచిన్న కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా ఇప్పుడు సొంత ఊర్లో ఉన్నారు .

హైదరాబాదులో ఎక్కువగా ఉండేది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాళ్లే. దీనితో వాళ్ళందరూ కూడా కరోనా వైరస్ కి భయపడి సొంత ఊళ్లకు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎలాగో సంస్థలు వర్క్ ఫ్రొం హోమ్ ప్రకటించాయి. కాబట్టి అదే విధంగా విద్యార్థులకు కాలేజీలు ,స్కూల్స్ అన్ని సెలవులు ప్రకటించాయి. దానికితోడు చిన్న చిన్న పనులు కూడా హైదరాబాద్ లో ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనితో వాళ్ళందరూ కూడా సొంత ఊళ్లకు వెళ్లిపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ లో ట్రాఫిక్ కూడా భారీగా తగ్గింది అంటున్నారు. ఇక అక్కడి జనాలు కూడా కరోనా వైరస్ కి భయపడి రోడ్ల మీదకు వచ్చి సాహసం పెద్దగా చేయడం లేదు.

దీనితో హైదరాబాద్ వీధులన్నీ నిర్మానుష్యంగా కనపడుతున్నాయి. సరదాగా సినిమాకి వెళ్ళి వాళ్ళు లేరు. సరదాగా షాపింగ్ చేసే వాళ్ళు లేరు. రోడ్లమీద సరదాగా తిరిగే వాళ్ళు కనపడటం లేదు. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ అదేవిధంగా ఎన్టీఆర్ పార్క్ ,గోల్కొండ, హైటెక్ సిటీ ఇలా ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ప్రజలను బయటకు రావద్దని హెచ్చరిస్తున్న నేపథ్యంలో జనాలు ఎవరు కూడా బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. దానికి తోడు ఆదివారం జనతా కర్ఫ్యూ ని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శనివారమే భారీగా సరుకులు కూరగాయలు వంటి వాటిని నిత్యావసర సరుకులను కూడా కొనుక్కుని సిద్ధంగా ఉంచుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version