వీళ్ళు మనుషులేనా ? శిశువు పుట్టకముందే లక్షకు డీల్ !

నాచారం పోలీసులు పసికందు విక్రయం కేసును చేదించారు. డబ్బుల కోసమే ఆ బాబు తల్లితండ్రులు అయిన మీనా, వెంకటేష్‌ లు కన్నబిడ్డను అమ్మినట్లు తేల్చారు. బాబు పుట్టకముందరే లక్ష రూపాయలకు రాజేష్ దంపతులతో డీల్ కుదుర్చుకుని, ముందే 50 వేలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు గుర్తించారు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో, మూడోసారి కూడా ఆడపిల్లే పుడుతుందని భావించిన అమ్మకం పెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.

బాబు పుట్టడంతో మరో నాలుగు లక్షల రూపాయలు అదనంగా డిమాండ్ చేయగా ముందు చెప్పలేదు కదా అని రాజేష్ దంపతులు నిరాకరించారు. దీంతో నాలుగు నెలల తర్వాత బాబు తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరుజంటలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మధ్యవర్తి జానకి ద్వారా బాబును రాజేష్, నవీన దంపతులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు.