హైదరాబాద్ లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచనలు !

హైదరాబాద్‌ను మరోసారి వరణుడు వణికించాడు. మూడ్రో జుల కిందట కురిసిన భారీ వర్షం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి ఉరుములు, మెరుపులతో కూడిన వానపడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న సమయం కావడంతో… భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఇప్పటికే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది… వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తిస్తున్నారు. వరద ప్రభావంతో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు సహాయక బృందాలను పంపించారు.

ఈ నేపధ్యంలో పోలీసులు పలుకీలక సూచనలు చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అంటున్నారు. చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండని, విద్యుత్ పోల్స్, ఎలాంటి వైర్లను ఎట్టిపరిస్థితుల్లో తాకవద్దని కోరుతున్నారు. అలానే వరదనీటిలోకి వెళ్లే సహసం చేయవద్దని, లోతట్టు ప్రాంతల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లండని పోలీసులు కోరారు. పురాతన, శిధిలావస్థ లో ఉన్న భవనాలను వీడి బయటకు రావాలని కోరుతున్నారు. బైకులు, కార్లు వరదలో చిక్కుకుంటే ముందు మీరు బయట పడండని, ఏ ఆపద వచ్చిన 100 కాల్ చేయండని పోలీసులు కోరుతున్నారు.