అఖండ ప్ర‌మోష‌న్ లో హైద్రాబాద్ పోలీస్ ఎందుకంటే?

-

రికార్డులు కొల్లగొడుతున్న అఖండ సినిమా పై హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు మరో సంచలన ట్వీట్ చేశారు. రోడ్డు భద్రతను ప్రోత్సహించినందుకు నటుడు సినీ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను అలాగే… “అఖండ” సినిమా టీమ్ అందరికీ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

అఖండ సినిమాలోని బాలయ్య, హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ ఇద్దరు కారులో వెళ్లే ఓ సీన్‌ ను ట్యాగ్‌ చేస్తూ.. ఈ ట్వీట్‌ చేశారు హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్ పోలీసులు. ఇందులో బాలయ్య అలాగే హీరోయిన్‌ ప్రగ్యా ఇద్దరూ సీట్‌ బెల్టు పెట్టుకుని ఉంటారు. కారు సీట్ బెల్ట్ ధరించి ఎంత దూరమైనా, ఎవరి కారు అయినా సరే ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించండి అంటూ ఈ ట్వట్‌ లో పేర్కొన్నారు. ఇలాగే ప్రజలందరూ సీట్‌ బెల్టు పెట్టాకోవాలని సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news