వైర‌లహే : ఊ అంటావా జ‌గ‌న్ .. ఊహూ అంటావా!

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాదం చెలరేగుతోంది. మొదట్లో పీఆర్సీ కోసం ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో… జగన్‌ సర్కార్‌ దిగి వచ్చి.. పీఆర్సీ పై ప్రకటన చేసింది. 23 శాతం ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తున్నట్లు ప్రకటించిన సర్కార్‌.. రిటైర్మెంట్‌ వయస్సును కూడా 62 సంవత్సరాలకు పెంచేసింది. అయితే.. మొదట పీఆర్సీకి ఒకే చెప్పిన ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు కు సిద్దం అయ్యారు.

పీఆర్సీని ఎత్తేసి.. కేంద్ర ప్రభుత్వం తరహాలో నడుచుకుంటామని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. దీంతో ఉద్యోగులు మరోసారి సమ్మెకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని భీక్షించుకుని కుర్చున్నారు. అంతేకాదు.. ఉద్యోగులకు ఆర్టీసీ, ప్రతి పక్షాలు కూడా సంఘీ భావం తెలిపాయి. దీంతో వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు ఉద్యోగులు. ఇందులో భాగాంగానే సమంత ఐటెం సాంగ్‌ ను వాడుకుని.. జగన్‌ సర్కార్‌ కు వ్యతిరేకంగా ఉద్యోగులు పాట పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.