తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయని పేర్కొంది. నిన్న ఉదయం శేర్లింగంపల్లి లో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు కూడా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అంతేకాకుండా ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపద్యంలో హైదరాబాదులో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈరోజు ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రత లు భారీగా పడిపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.