సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. స్థానికుల ఫిర్యాదు మేరకు వందనపురి కాలనీలోని 848 సర్వే నెంబర్లో గల నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతలకు ముందే ఆయా భవనాలకు నోటీసులు సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.
సోమవారం తెల్లవారుజామున భారీయంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు వెనువెంటనే భవనాలను కూల్చివేస్తున్నారు. బాధితులు అక్కడ ఆందోళన చేస్తుండగా గందరగోళం నెలకొంది. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే,నిర్మాణ సముదాయాల జోలికి వెళ్లమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.