నేను వారితో రిలేషన్షిప్ లో ఉన్నా: విజయ్ దేవరకొండ

-

పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.’ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుండటంతో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడిగిన ప్రశ్నకు విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాను తన తల్లిదండ్రులు, సోదరుడితో పాటు ఇంటర్వ్యూయర్తో కూడా రిలేషన్షిప్ ఉన్నానని హాస్యభరితంగా స్పందించారు. నటి రష్మికతో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇదివరకే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ , ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు 100 కోట్ల క్లబ్బులో చేరిన పలు చిత్రాలను తెరకెక్కించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version