పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. సవాళ్లను చూసి కొందరు భయపడి పారిపోతారని,కానీ, తాను భయపడే రకం కాదని.. ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదుర్కోవడం తనకు ఇష్టమని అన్నారు.
ఎలక్షన్స్ రాగానే కొందరు హైరానా పడిపోయి… భయాందోళనకు గురవుతారు. నాకు మాత్రం అలా ఉండదు. ఎలక్షన్స్ అంటే ఆనందంగా, ఆసక్తిగా ఉంటుంది. ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిర నిర్మాణంతో 500 ఏళ్ల దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్ సభ లో రామమందిర నిర్మాణంపై ధన్యవాద తీర్మాణం ప్రవేశ పెట్టారు.బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి,సత్యపాల్ సింగ్, సంతోష్ పాండే రామమందిర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఎంపీలు సుదాన్షు త్రివేది, కె.లక్ష్మణ్, రాకేష్ సిన్హా తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం బాల రాముని ప్రాణ ప్రతిష్టపై బీజేపీ ఎంపీలు చర్చను లేవనెత్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు.