తెలంగాణ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు పెద్దపీట

-

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు పెద్ద పీట వేసింది తెలంగాణ ప్రభుత్వం.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 53,196 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిoది. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకూ కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.అమరుల కలలను నిజం చేస్తామని చెప్తూ తెలంగాణ ప్రజలలో మార్పు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని గత ప్రభుత్వ పాలనపై విమర్శలు కురిపించారు.మూసీ ప్రాజెక్టు చేపట్టేందుకు బడ్జెట్లో రూ. 1000 కోట్లు కేటాయించమన్నారు.

ఇవీ బడ్జెట్ విశేషాలు..

  • 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ. 2,75,891కోట్లు
  • ఆరు గ్యారెంటీల కోసం రూ. 53,196 కోట్లు
  • పరిశ్రమల శాఖ రూ. 2,543 కోట్లు
  • గృహజ్యోతి పథకానికి రూ. 2418 కోట్లు
  • వ్యవసాయానికి రూ. 19,746 కోట్లు
  • విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
  • వైద్యరంగానికి రూ. 11,500 కోట్లు
  • గృహ నిర్మాణ రంగానికి రూ. 7,740 కోట్లు
  • ఐటీ శాఖకు రూ. 774కోట్లు
  • పురపాలక శాఖకు రూ. 11,692కోట్లు
  • ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 21, 874 కోట్లు
  • మైనారిటీ సంక్షేమానికి రూ. 2262 కోట్లు
  • నీటి పారుదల రంగానికి 28,024 కోట్లు
  • తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 500 కోట్లు.

తాజా బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ గత బడ్జెట్ కంటే రూ.70వేల కోట్లు తగ్గించామన్నారు. ఈ సారి 23శాతం బడ్జెట్ తగ్గిందని చెప్పారు. గతంలో బడ్జెట్లు అబద్ధాలతో నడిపించారని అన్నారని,తాము మొదటి రోజే నిజం చెప్పాలి అనుకున్నామని అన్నారు.పూర్తి వాస్తవాలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టామని చెప్పారు.అలాగే మేడిగడ్డ విజిట్ కు ప్రతిపక్ష నాయకులను కూడా పిలుస్తామని తెలిపారు.ప్రస్తుతం మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని.. తరువాత జుడిష్యల్ ఎక్వరిలో దోషులు తేలుతారన్నారు.

బడ్జెట్ లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కామెంట్ చేశారు.ఎన్నికల ప్రచారంలో అబద్దాలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు పాలనలో కూడా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్ రావు మాట్లాడుతూ.. బడ్జెట్ అన్ని వర్గాల వారిని నిరాశ పరిచిందన్నారు. రైతు రుణమాఫీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని.. రైతుబంద్ ఆపై సర్కార్ ఆంక్షలు పెడుతోందని విమర్శించారు.

బడ్జెట్ అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీలో బడ్జెట్ ను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రకటించగా అటు శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఏమాత్రం సంతృప్తిగా లేదంటున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం కాంగ్రెస్ నేతలను అటాక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version