‘ఖేల్‌రత్న’ అవార్డుకు నేను అర్హుడిని కాదు: హర్భజన్ సింగ్.!

-

‘ఖేల్‌రత్న’ అవార్డు నామినేషన్స్ నుంచి పంజాబ్ ప్రభుత్వం తన పేరు తొలగించడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించారు. ‘ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వం తప్పులేదు. ఖేల్‌రత్న నిబంధన ప్రకారం గత మూడేళ్ల కాలంలో అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలి. అలా చూస్తే నాకు అర్హత లేదు. అందుకే నేనే దరఖాస్తు వెనక్కి తీసుకోమని వారికి విజ్ఞప్తి చేశాను.’ అని హర్భజన్ వివరించారు.

గత మూడు సంవత్సరాలుగా క్రీడాకారులు చూపే ప్రదర్శన ఆధారంగా ఖేల్‌రత్న అవార్డుకు సిఫారసు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే 40 ఏళ్ల వయసున్న హర్బజన్ సింగ్.. 2016 నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. భజ్జీ 2016లో చివరిసారి ఆసియాకప్‌లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version