నేను ఏసీబీ అంటూ ఏకంగా ఎమ్మెల్యే పిఏని గూగుల్ పే చేయమన్నాడు…!

-

ఏకంగా ఎమ్మెల్యే పిఏకే వల వేసాడు ఒక మాయగాడు. ఏసీబీ డీఎస్పీ నంటూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పీఏకు హరికృష్ణ అనే మాయగాడి ఫోన్ సంచలనం సృష్టించింది. చిత్తూరులో వీఐపీల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నామని ఫోన్ చేసాడు. తనని తాను ఏసీబీ డీఎస్పీ హరిగా పరిచయం చేసుకుని కథ అల్లడం మొదలు పెట్టాడు. తాము దాడులు చేస్తూ ఉన్న ఫలంగా వచ్చి చిత్తూరులో ఒక లాడ్జ్ లో ఉన్నామని చెప్పాడు.

తమ దగ్గర ఏటీఎం కార్డులు మాత్రమే ఉన్నాయని ఖర్చులకు డబ్బులు పంపాలని కూడా హరికృష్ణ. ఇందుకు గూగుల్ పే చేయమని కోరాడు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఎమ్మెల్యే పీఏ. అర్ధరాత్రి లాడ్జ్ లో నకిలీ ఏసీబీ అధికారి హరికృష్ణని అదుపులోకి తీసుకున్న చిత్తూరు పోలీసులు రిమాండ్ చేసారు. చిత్తూరు జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులకు ఇలాగే ఫోన్ చేసిన హరికృష్ణ వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news