‘నా కూతురు మరో ఆలియా కావొద్దనే కోరుకుంటా’.. రణబీర్ కపూర్

-

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇటీవల వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా రణబీర్ నటించిన తూ ఝాఠీ మై మక్కర్ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇందులో రణబీర్ కపూర్ కి జోడిగా శ్రద్ధ కపూర్ నటించింది అయితే తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయగా ఇందులో పాల్గొన్న రణబీర్ కపూర్ తన భార్య ఆలియా భట్ కూతురు రాహ కపూర్ పై ఆసక్తిగారు కామెంట్ చేశారు.

స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో తన కూతురు రహ కపూర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తన కూతురు చాలా అందంగా ఉంటుందని, తనను చూస్తూ ఉంటే అసలు సమయం తెలియదు అంటూ చెప్పకువచ్చారు. అలాగే రాహకు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి నాకు 60 ఏళ్ళు వస్తే తనతో నేను ఎలా ఆడుకోగలను అంటూ కూతురుపై ఉన్న ప్రేమను తెలిపారు. కాగా తాజాగా మరొకసారి తన భార్య ఆలియాభట్ కూతురు రాహ కపూర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నా భార్య ఆలియా భట్ లా తన కూతురు అస్సలు కావద్దంటూ చెప్పుకొచ్చారు రన్బీర్. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నా కూతురిని చూస్తే అచ్చం ఆలియాని చూసినట్లే ఉంటుంది. రాహాకి తన తల్లి పోలికలే ఎక్కువగా వచ్చాయి. అలా కనిపిస్తున్నప్పుడు తను చాలా అందంగా కూడా అనిపిస్తుంది అయితే రాహా కి మాత్రం ఆలియా ప్రవర్తన అస్సలు రాకూడదని కోరుకుంటా ఎందుకంటే ఆలియా చాలా గట్టిగా మాట్లాడుతుంది ఎక్కువగా మాట్లాడుతుంది. రాహా కూడా నా భార్యలాగే ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అయితే నా పని అయిపోతుంది. ఇలాంటి ఇద్దరు అమ్మాయిలను మేనేజ్ చేయడం నాకు కష్టం అవుతుంది. అందుకే రాహా కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటుందని ఆశిస్తున్నా. అప్పుడు ఇద్దరం కలిసి ఆలియాని సులభంగా మేనేజ్ చేయగలం.. ” అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు..

Read more RELATED
Recommended to you

Exit mobile version