ఆ పాత్ర కోసం స్టార్ హీరోతో గడిపాను : కంగనా

-

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ వివాదాలతో కూడా అంతకు మించిన గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్. ఇక ఈ మధ్య కాలంలో అయితే కంగనా మరింత రెచ్చిపోయి మరీ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖుల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ… ఎప్పుడు మీడియాలో నానుతూనే ఉంది ఈ అమ్మడు. ఇక ఇటీవలే పార్లమెంటులో జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

తాను ఎంచుకున్న సినిమాల వల్ల తనకు ఎంతగానో గుర్తింపు వచ్చింది అంటూ తెలిపిన కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్… బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్త్రీవాద నేర్పించింది తానే అంటూ చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొత్తలో మంచి పాత్రల కోసం ఎంతగానో ఎదురు చూసానని… ఏకంగా పెద్ద పాత్రల కోసం ఒక హీరోతో గడిపినప్పటికీ కూడా… పెద్ద పాత్రలు ఇవ్వకుండా చిన్న పాత్రల్లోనే అవకాశం ఇచ్చారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే తనను ఉపయోగించేవారు అంటూ చెప్పుకొచ్చింది కంగనా. కాగా ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version