తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అలాగే వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారిని బదిలీ చేసింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్డీగా ఉన్న ముర్తుజారిజ్వీకి ఆ బాధ్యతలు అప్పగించింది.
శాంతికుమారిని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సాగునీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌అండ్ టెక్నాలజీ బాధ్యతలను అదనంగా చూడనున్నారు. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గాఉన్న యోగితారాణాను బదిలీచేసి ఆ స్థానంలో వాకాటి కరుణకు బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరికి అదనంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు.