కోహ్లీకి బిగ్ షాక్…ఐసీసీ ర్యాంకింగ్స్ లో దిగజారిన ర్యాంక్

-

ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి బిగ్ షాక్ తగిలింది. బ్యాటింగ్ విభాగంలో రెండు స్థానాలు దిగజారి 9వ స్థానం లో నిలిచారు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ ఐదో ర్యాంకులో ప్రస్తుతం కొనసాగుతున్నారు. అటు టీమిండియా వైస్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ 18 స్థానాలు ఎగబాకి 31 వరకు చేరుకున్నారు.

దక్షిణాఫ్రికా కెప్టెన్, ఓపెనర్ డీన్ ఎల్గర్ రెండు ర్యాంకులు ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు. అలాగే తెంబా బావుమా 16 స్థానాలు ఎగబాకి 39వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలో టీమిండియా పేసర్లు బుమ్రా, మహమ్మద్ షమీ ర్యాంకులు మెరుగుపరుచుకున్నారు. బూమ్రా మూడు ర్యాంకులు జరిగి 9వ స్థానానికి చేరుకోగా… మహమ్మద్ సామి రెండు స్థానాలు ముందుకు జరిగి 17వ స్థానంలో నిలిచాడు. అటు రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబడా ఓ ర్యాంకు ముందుకు జరిగి ఆరో స్థానానికి చేరుకోగా ఎంగిడి ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 30వ కొనసాగుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news