కస్టమర్స్ కు ఝలక్ ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంక్.. ఇకపై ఆ ఛార్జీలు బాదు డే..!

-

బ్యాంకులు దాదాపుగా ఎలాంటి సర్వీసులు కూడా కస్టమర్లకు ఉచితంగా అందించవు. ఆ చార్జీలు, ఈ చార్జీలు అంటూ వసూలు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా బ్యాంకులు కస్టమర్లకు మరో ఝలక్ ఇవ్వనున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తున్నాయి. క్యాష్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. బ్యాంక్ సెలవులు సహా బ్యాంక్ పనివేళలు ముగిసిన తర్వాత ఏటీఎం మెషీన్‌కు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేసే వారికి ఈ చార్జీలు పడుతున్నాయి. దీంతో కస్టమర్లపై భారీ ప్రభావం చూపుతున్నాయి.

ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ ఈ తరహా చార్జీలను వసూలు చేస్తోంది. తాజాగా ప్రైవేట్ రంగంలో ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఇదే బాటలో పయనించేందుకు సిద్ధం అవుతోంది. నవంబర్ 1 నుంచి ఈ తరహా చార్జీలు విధించాలని నిర్ణయించింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లపై ఎఫెక్ట్ పడబోతోంది. 1 నవంబర్ 2020 నుంచి కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తామని, ఒక్క లావాదేవీకి రూ.50 చార్జీ పడుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎం మెషీన్లలో డబ్బులు డిపాజిట్ చేస్తే కూడా ఈ చార్జీలు వర్తిస్తాయి.

బ్యాంక్ హాలిడేస్, బ్యాంకింగ్ పని వేళలు ముగిసిన తర్వాత చేసే ప్రతి ట్రాన్సాక్షన్లపై ఈ ఫీజు తప్పదని ఐసీఐసీఐ బ్యాంక్ ఇటీవలే వెల్లడించింది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. క్యాష్ డిపాజిట్ నెలకు రూ.10,000 మించితేనే ఈ చార్జీలు వర్తిస్తాయి. అయితే ఇక్కడ బ్యాంక్ ఒక వెసులుబాటు కూడా కల్పించింది. సీనియర్ సిటిజన్స్‌కు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి కూడా ఈ చార్జీలు వర్తించవు. ఇంకా వికలాంగులకు, స్టూడెంట్ అకౌంట్లకు ఈ చార్జీలు వర్తించవు. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంకు కస్టమర్లు కేవలం బ్యాంకు సమయంలో మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తే ఎటువంటి చార్జీలు వర్తించవు లేదా మీరు చేసే ట్రాన్సాక్షన్స్ కన్నా మీరు కట్టాల్సిన డబ్బులు ఎక్కువ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news