గుడ్ న్యూస్: ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సేవలు..!

Join Our Community
follow manalokam on social media

ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.
ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సేవలుని ప్రారంభం చేసింది. మరి ఆ కొత్త సేవలు ఏమిటి అనే విషయానికి వస్తే… సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమలకు MSME లకు ప్రిపెయిడ్ కార్డులను జారీ చేయడమే… అయితే ఐసీఐసీఐ బ్యాంక్ దీని కోసం మరో కంపెనీతో జతకట్టింది. పూర్తి వివరాల లోకి వెళితే.. నియో అనే ఫిన్‌టెక్ కంపెనీ తో ఈ బ్యాంక్ పార్ట్నర్ షిప్ కుదుర్చుకుంది. దీనితో ఎంఎస్ఎంఈలకు ఐసీఐసీఐ బ్యాంక్ నియో భారత్ పేరోల్ కార్డులను జారీ చేయనుంది.

ఇక వీటి గురించి చూస్తే… ఇవి వీసా కార్డులు. ఈ కార్డుల ద్వారా ఎంఎస్ఎంఈలు సులభం గానే ఉద్యోగులకు వేతనాలు చెల్లించొచ్చు. ఈ కార్డు అకౌంట్‌ లోకి గరిష్టంగా రూ.లక్ష వరకు పొందొచ్చు.
ఈ కొత్త ప్రిపెయిడ్ కార్డుల వల్ల వర్కర్లకు బాగా బెనిఫిట్ కలుగనుంది. ఇలా ఎంఎస్ఎంఈలు నియో సంస్థలో భాగస్వామ్యం కుదుర్చుకో వచ్చు. ఇలా ఈ సర్వీసులు వల్ల ప్రిపెయిడ్ కార్డు పొందొచ్చు.

మరో విషయం ఏమిటంటే.. ఐసీఐసీఐ ప్రిపెయిడ్ కార్డులను వర్కర్స్ ఉన్న చోటుకి వచ్చి జారీ చేస్తారు. ఇలా కేవైనీ కోసం సంస్థ వర్కర్ల వద్దకు వచ్చి బయోమెట్రిక్స్ తీసుకుంటుంది. ఇది ఇలా ఉంటె తర్వాత అకౌంట్ క్రియేట్ చేసి ప్రిపెయిడ్ కార్డులను జారీ చేస్తారు. పూర్తి అయితే ఏటీఎం నుంచి డబ్బులు ఐసీఐసీఐ ప్రిపెయిడ్ కార్డు ఉపయోగించి తీసుకో వచ్చు. ఆన్‌లైన్‌లో షాపింగ్ కి, పీఓఎస్ మెషీన్ల లో లావాదేవీలు నిర్వహించొచ్చు.

TOP STORIES

ఖాతాదారులకు అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఆన్‌లైన్‌ యూపీఐ మోసాలు పట్ల అలర్ట్‌ చేసింది. ట్వీట్టర్‌...