ఐసీఐసీఐ ఫెస్టివ్ బొనాంజా.. రుణాలపై ఆకర్షణీయ ఆఫర్లు..!

-

పండగ సీజన్ రావడంతో చాలా మంది లోన్స్ తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక పర్సనల్ లోన్ తీసుకునే వారికి కూడా ప్రయోజనం ఉంటుంది. ఇందుకుగాను వడ్డీ రేటు 10.5 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.3,999 చెల్లించాలి. ఇక కన్సూమర్ ఫైనాన్స్ లోన్స్‌ కింద ప్రముఖ బ్రాండ్ల ప్రొడక్టుల కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందొచ్చు. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. పండుగ సీజన్ నేపథ్యంలో రుణ గ్రహీతల కోసం పలు రకాల ఆఫర్లు అందిస్తోంది. ఫెస్టివ్ బొనాంజా పేరుతో ఆకర్షణీయ వడ్డీ రేట్లకే రుణాలు ఆఫర్ చేస్తోందని బ్యాంకు అధికారులు తెలిపారు.

icici-bank

ఇక కార్ లోన్, టూవీలర్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్స్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్స్ వంటివి కూడా పొందొచ్చు. ఇక అక్టోబర్ 1 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్, జ్యూవెలరీ, హెల్త్ అండ్ వెల్‌నెస్, గ్రాసరీ అండ్ ఫుడ్ ఆర్డరింగ్, ఆటోమొబైల్ అండ్ ఫర్నీచర్, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇలెర్నింగ్ వంటి వాటిపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చునని తెలిపారు.

అయితే హోమ్ లోన్స్ లేదా ఇతర బ్యాంకుల నుంచి హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ‌పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు రూ.3,000 నుంచి మెుదలవుతుంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారకి ఫ్లెక్సిబుల్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.లక్ష రుణ మొత్తానికి ఈఎంఐ రూ.1554 నుంచి ప్రారంభమౌతోంది. 84 నెలల టెన్యూర్‌ కు ఇది వర్తిస్తుంది. మహిళలు కార్ లోన్ తీసుకుంటే రూ.1,999 ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంటుందన్నారు. ఇక టూవీలర్ లోన్స్‌పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. రూ.1,000కు కేవలం ఈఎంఐ రూ.36 నుంచి ప్రారంభమౌతోంది. 36 నెలల కాల పరిమితిలోని రుణాలకు ఇది వర్తిస్తుంది. ఈ తరహా రుణాలపై రూ.999 స్పెషల్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version