ఇదేం ప్రయోగం రా బాబు.. ఆఖరికి ఇడ్లీతో కూడానా..!!

-

సాదారణంగా బర్గర్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది మాత్రం బన్..బన్ కూరగాయలు, నాన్ వెజ్ తో చేస్తారు..కానీ ఇడ్లీతో బర్గర్ చేయడం ఎప్పుడైనా చూశారా? పోనీ ఎప్పుడైనా వినారా..అసలు చాన్స్ లేదని అనుకోకండి..ఇప్పుడు ఇడ్లీ బర్గర్ కూడా బాగా ఫెమస్ అయ్యింది..బన్‌ను నిలువగా కోసి దాని మధ్యలో కూరగాయలు, సాస్, ఆలుటిక్కా లేదా చికెన్ టిక్కాలు, చీజ్ పెడతారు. తినేప్పుడు అది చాలా స్పైసీగా, క్రంచీగా ఉంటుంది. మీకు కూడా ఆ రుచి తెలిసే ఉంటుంది.

ఇడ్లీతో బర్గర్ అంటే ఎలా ఉంటుందనేగా మీ సందేహం? అయితే, అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి.స్ట్రీట్ ఫుడ్ భాగ్యనగర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

ఇందుకు మీకు కావల్సింది జస్ట్ రెండు ఇడ్లీలు, ఆలు టిక్కా, చట్నీ, వెజ్ మయోనేజ్ ఉంటే చాలు. ముందుగా ఒక పెద్ద సైజు ఇడ్లీ తీసుకుని దానికి స్పైసీ చట్నీ రాయాలి. ఆ తర్వాత వెజ్ మయోనేజ్ పెట్టాలి. దానిపై ఆలు టిక్కా పెట్టి, మళ్లీ వెజ్ మయోనేజ్, చట్నీ, కాస్త టమోటా సాస్ రాసి చివరగా దానిపై మరో ఇడ్లీ పెడితే చాలు ఎంతో రుచికరమైన ఇడ్లీ బర్గర్ రెడీ.. ఇంక ఎటువంటి వింత వంటలు వస్తాయో చూడాలి..చూసారుగా మీరు కూడా నచ్చితే ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version