300కు పైగా పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే భూమి బద్దలైందా..? : కేసీఆర్

-

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కరీంనగర్‌ కదనభేరి సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మేడిగడ్డ ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ 300కు పైగా పిల్లర్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారు అని మండిపడ్డారు .దేశమే కొట్టుకుపోయినట్లు మాట్లాడుతున్నారు. రెండు కుంగితే భూమి బద్దలైందా..? అని ప్రశ్నించారు.మేడిగడ్డ పేరు చెప్పి నన్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో టీవీల్లో కూర్చుని కాళేశ్వరంపై వివరిస్తా’ అని కేసిఆర్ పేర్కొన్నారు.

పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని కేసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు అని అన్నారు. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు అని దుయ్యబట్టారు.ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది అని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. మొన్న నేను గెలిచి ఉంటే.. దేశంలో అగ్గిపెట్టేవాణ్ణి. అందర్నీ చైతన్యం చేసేవాడిని’ అని కేసిఆర్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news