ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశము అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డీఎస్సీ-2008 క్వాలిఫైడ్ అభ్యర్థులకు శుభ వార్త అందించింది.
డీఎస్సీ 2008కు అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. మినిమం టైమ్ స్కేల్తో ఉద్యోగాలు ఇవ్వనుంది. అలాగే ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇకపై 25 నుంచి 30 ఎకరాల్లో విక్రయాలు జరుపుకునే సౌకర్యం కల్పించనుంది.