దీపావళి కి పటాకులు కాలుస్తారా.. అయితే పది వేలు కట్టాల్సిందే..!

-

ప్రస్తుతం దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ పర్యావరణ కాలుష్యాన్ని రక్షించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పటాసులు కాలుస్తే లక్ష రూపాయలు జరిమానా విధించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే ఇక ఇదే తరహా నిర్ణయం తీసుకుంటున్నాయి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇటీవలే రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుంది.

రాజస్థాన్ లో దీపావళి బాణసంచా అమ్మిన వారికి పదివేల రూపాయలు వాటిని కొని పేల్చినా వారికి రెండు వేల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. కాగా బాణాసంచ వాడకంపై నిషేధం ఎత్తివేయాలి అంటూ జహీర్ అహ్మద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం దీపావళి రోజు మాత్రమే పేల్చే పటాకుల వల్ల నాలుగు శాతం మాత్రమే కాలుష్యం జరుగుతుందని రోజు తిరిగే వాహనాల ద్వారానే 96% కాలుష్యం జరుగుతోంది అంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news