ఆధార్ ఉంటేనే అంత్యక్రియలు…!

-

ఆధార్ కార్డు అంటే సాధారణం గా అందరికీ తెలిసిన విషయం ఒకటే, అది ఒక గుర్తింపు కార్డు అని. మన ఊరు, పేరు తో కూడి ఉండిన గుర్తింపు కార్డు అనేది మాత్రమే. అయితే మనం వేరే ప్రాంతం ఎక్కడికైనా వెళ్తే ఆధార్ కార్డు ను వెంట తీసుకెళ్తాము, ఎందుకంటే ఏదైనా సమస్య వస్తె మన వివరాలు చూపేందుకు ఉపయోగిస్తాము. అయితే ఇందుకు భిన్నంగా బెంగుళూరు లో ఒక వృద్ధురాలికి మృతదేహానికి,

అంత్యక్రియలు జరిపేందుకు మృతురాలి ఆధార్‌ కార్డును చూపితే తప్ప అంత్యక్రియలు నిర్వహించేది లేదని బెంగళూరులో ఓ శ్మశానవాటిక నిర్వాహకులు మొండికేశారు. వివరాల్లోకి వెళ్తే బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) పరిధిలో నివాసం ఉంటున్న 75ఏళ్ల మహిళ వారం క్రితం మృతిచెందింది. ఆమె కు అంత్యక్రియలు జరిపేందుకు సుమనహళ్లి శ్మశానవాటికకు బంధువులు తీసుకెళ్లారు.

అక్కడి వారు మృతురాలి ఒరిజినల్‌ అధార్‌ కార్డును చూపెట్టాల్సిందేనని నిర్వాహకులు చెప్పారు. ఆమె ఆధార్‌ను తీసుకువద్దామని అనుకున్నా , అదెక్కడుందో బంధువులకు తెలియలేదు. కనీసం ఈ-ఆధార్‌ తీసుకుందామని బందువులు భావించారు, కానీ దానితో లింక్‌ అయిన మొబైల్‌ నంబరు పనిచేస్తుండకపోవడంతో అది కూడా సాధ్యం కాలేదు. దీంతో సమస్యను మృతురాలి బంధువులు శ్మశాన వాటిక నిర్వాహకులకు వివరించారు.

అయినా వాళ్లు మాత్రం ఆధార్‌ కావాల్సిందేనంటూ మొండికేశారు. మృతురాలి బంధువులు ఎలాగో తంటాలు పడి ఆ ఫోన్‌ నంబరును అప్పటికప్పుడు యాక్టివేట్‌ చేయించి, ఈ-ఆధార్‌ కార్డు తీసుకువచ్చి, అది శ్మశానవాటిక నిర్వాహకులకు చూపించి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆధార్‌ కార్డు ఉంటేనే అంత్యక్రియలకు అనుమతి అనడం పై ప్రజలు విస్తుపోతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం అని ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news