పెళ్ళంటే నూరేళ్ళ పంట..పవిత్రమైన మంగళ సూత్రం..ఏడు అడుగుల, మంగళ వాయిద్యాలు, బంధుమిత్రల సమక్షంలో జరుగుతుంది.వివాహం ఎంత గొప్పదో..ఆ బంధాన్ని నిలపెట్టుకోవడం మన చేతుల్లో ఉంటుంది.. ఒకరిపై మరొకరికి పూర్తీ నమ్మకం ఉండాలి.నమ్మకం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఒక సున్నితమైన విషయం కానీ శక్తివంతమైన అయస్కాంతం లాంటిది.ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని దృఢపరుస్తుంది.
మీరు ఎరితోనైనా నిలేషన్ షిప్ ప్రారంభిస్తున్నప్పుడు నమ్మకాన్ని పెంచుకోవడం ఒక సవాలుతో కూడుకున్న పని. రిలేషన్‌షిప్‌లో ముడిపడిన తర్వాత… ప్రతి సందర్భంలోనూ ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకాన్ని కొనసాగించడం కూడా సవాలుగా ఉంటుంది.. అయితే రిలేషన్ లో నమ్మకం పెరగాలంటే ఏం చెయ్యాలి..ఇప్పుడున్న రోజుల్లో ఒకరి పట్ల మరొకరితో ఎలా ఉండాలి అనేది నేర్చుకుందాము..
ఆ బంధం మరింత బలపడాలంటే ఈ పనులు తప్పక చెయ్యాలి..
మీ బంధం గురించి తెలుసుకోవాలి..
ముందుగా మీరిద్దరూ కలిసి ఉండటానికి గల కారణాలను అర్థం చేసుకోండి. దీంతో మీరు ఒకరికొకరు ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు. తద్వారా మీరు మీ రిలేషన్ షిప్ లో మంచి మార్గంలో నమ్మకాన్ని పెంపొందించుకోగలుగుతారు.
గౌరవం..
మీరు ఎవరినైనా ప్రేమిస్తే, గౌరవిస్తుంటే…వారిని గౌరవించడం కూడా ముఖ్యం. మీరిద్దరూ ఒకరినొకరు ఎంతగా గౌరవించుకుంటే, పరస్పర అవగాహన, ప్రేమ పెరుగుతుంది. కాబట్టి ఒకరినొకరు అగౌరవపరిచే వాటిని మీ రిలేషన్ షిప్ లో రానివ్వవద్దు.
ఎక్కువగా ఆశించవద్దు..
సినిమాలతో మీ రిలేషన్ షిప్ ని పోల్చుకోకండి. మీ రిలేషన్ షిప్, స్నేహం, ప్రేమ, పరస్పర బంధం గురించి వాస్తవికంగా ఉండండి. నిజమైన ప్రేమ,గౌరవం, నమ్మకం.. వ్యక్తీకరణ స్వేచ్ఛ తర్వాత మాత్రమే వృద్ధి చెందుతుందని పూర్తిగా తెలుసుకోవాలి..
కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాలి..
గొడవల మధ్య ఎప్పుడూ ఒకరి కుటుంబాన్ని మరొకరు తీసుకురాకండి. ఇలా చేయడం ద్వారా మీరు వారిని అగౌరవపరుస్తారు.ఇది బంధం తెగిపోయె వరకూ తీసుకెళ్తుంది.
ఒకరికొకరు సమయం..
ఒకరితో ఒకరు క్వాలిటీ సమయాన్ని గడపడంతోపాటు ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకోవడం ఇవ్వడం అంతే ముఖ్యం. మీ ఆప్షన్స్ విషయంలో మీరిద్దరూ రాజీ పడాల్సిన అవసరం లేదు. మీరు మీ అభిరుచులపై మీకు నచ్చినట్లుగా ఉండాలి. తద్వారా మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు..
మన వాళ్ళే కదా అని చిన్నవాటిని లైట్ తీసుకుంటారు.. అలా చేస్తే మొదటికే మోసం కలుగుతుంది.. తనకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అంత స్ట్రాంగ్ అవుతుంది..ఇవన్నీ తెలుసుకుని మెలిగితే బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది.