ఆత్మీయత, ఆలింగనం.. నాకు దక్కిన గౌరవం : చిరంజీవి

-

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఏపీలోని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్‌ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ కార్య‌క్రమానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌లు హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోల‌తో చిరు సోమ‌వారం రాత్రి ఓ ట్వీట్ చేశారు.

మొత్తం నాలుగు ఫొటోల‌ను త‌న ట్వీట్‌కు జ‌త చేసిన చిరంజీవి… అల్లూరి విగ్ర‌హావిష్కర‌ణ‌కు కేంద్రం త‌న‌ను ఆహ్వానించ‌డం, ఆ కార్య‌క్ర‌మంలో తాను పాలుపంచుకోవడాన్ని త‌న‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక నాలుగు ఫొటోల్లో ఒకటి మోదీ త‌న‌ను ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తున్న ఫొటో కాగా… మ‌రొక‌టి జ‌గ‌న్ త‌న‌ను ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకున్న ఫొటోగా ఉంది. మ‌రో ఫొటోలో కూర్చున్న మోదీకి జ‌గ‌న్ చూస్తుండ‌గా చిరు న‌మ‌స్క‌రిస్తున్నారు. చివ‌రి ఫొటోగా వేదిక‌పై ఉన్న వారంతా నిల‌బ‌డిన‌దిగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version