ఓ యువకుడు ఓ గే గ్రూపులో చేరి చివరకు ప్రాణాల మీదకు తెచ్చకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్, మీరట్‌కు చెందిన యశ్ అనే యువకుడు కొన్ని నెలల క్రితం ఆన్‌లైన్ గే గ్రూపులో చేరాడు. అదే గ్రూపులో ఉన్న షహ్వాజ్ అనే వ్యాపారిపై బెదిరింపులకు దిగాడు యశ్. అతడు గే అన్న విషయం బయటపెడుతానంటూ యశ్ బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆ విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు యశ్. అయితే ఈ నేపథ్యంలో.. షహ్వాజ్ మొదట 40 వేల యశ్‌కు ఇచ్చాడు. అయితే, యశ్ అంతటితో ఆగలేదు. మరింత డబ్బు కావాలన్నాడు. దీంతో షహ్వాజ్ మిగిలిన గే సభ్యులతో ఓ పథక రచన చేశాడు. వారంతా యశ్‌ను చంపాలని నిశ్చయించుకొని.. జూన్ 26న యశ్‌ను షహ్వాజ్ తన ఇంటికి పిలిచాడు.
ఈ క్రమంలో.. తర్వాత మిగిలిన సభ్యులతో కలిసి యశ్‌ను గొంతు నులిమి చంపేశాడు షహ్వాజ్. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి, డ్రైనేజ్‌లో పడేశారు గే సభ్యులు. యశ్ కనిపించకపోవటంతో అతడి కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. శనివారం డ్రైనేజ్‌లో యశ్ శరీర భాగాల్ని గుర్తించారు. షహ్వాజ్‌తో పాటు మరికొందరిపై అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడింది. షహ్వాజ్ చేసిన నేరం అంగీకరించాడు. అతడికి సహకరించిన మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.