కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ తన భూమికే ఎసరు పెట్టాడని సినిమా డైరెక్టర్,కాంగ్రెస్ సానుభూతిపరుడు సయ్యద్ రఫీ ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కేడర్‌తో పాటు తానూ ఆయన విజయం కోసం ఎంతో శ్రమించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పొన్నం నా భూమికే ఎసరు పెట్టాడు. గుడి కోసం రూ.30 కోట్ల భూమి ఇస్తే పక్కనున్న మా ప్రైవేట్ భూమి మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా పెట్టాడు.మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా బాగోతం మీద ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం’ సయ్యద్ రఫీ చేశారు.