కమీషన్లను కక్కుర్తి పడి ఓఆర్ఆర్‌ను రూ.7300 కోట్లకు అమ్ముకున్నారు : మంత్రి కోమటిరెడ్డి

-

అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మాలని నిర్ణయించడంపై ప్రతిపక్షాలు సభలో నిలదీశాయి.ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు.

‘కమీషన్లకు కక్కుర్తి పడి ORRను రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారు. లక్ష కోట్ల విలువ చేసే రోడ్డును రూ.7,300 కోట్లకు అమ్ముకున్న వీళ్లు కూడా భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నారు. హరీష్ రావుకు ఏం తెలియదు.ఆయన్ను ముందు పెట్టి వెనుక ఇద్దరు ఉండి నడిపిస్తున్నారు’ అని బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news