Indane కస్టమర్లు ఇకమీదట సిలిండర్ బుక్ చెయ్యాలంటే..కొత్త నెంబర్‌ తోనే సాధ్యం

-

మీరు ఎల్పిజి సిలిండర్ కస్టమర్ అయితే, మీరు తెలుకోవాల్సిన ముఖ్యమైన వార్త ఇది. ఇక మీదట Indane కస్టమర్లు పాత నంబర్ తో గ్యాస్ బుక్ చేయలేరు. ఎందుకంటే Indane తన కస్టమర్స్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ‌కు కొత్త బుకింగ్ నెంబర్‌ను పంపనుంది. ఇప్పుడు Indane కస్టమర్లు ఈ కొత్త బుకింగ్ నెంబర్ ద్వారా మాత్రమే గ్యాస్ రీఫిల్స్ కోసం సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు సిలిండర్ బుక్ చేసుకోవడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. వాటిలో మొదటిది డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి డైరెక్టుగా బుక్ చేసుకోవడం, రెండవది మొబైల్ నంబర్ నుండి కాల్ చేసి బుక్ చేయటం, మూడవది ఆన్‌లైన్, నాల్గవది కంపెనీ వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

గ్యాస్ బుక్ చేసుకోవడానికి మొదటి మార్గం మీ ఫోన్ నంబర్ నుండి కంపెనీ ఇచ్చిన నంబర్‌కు కాల్ చేసి బుక్ చెయ్యటం. అయితే ఇప్పుడు Indane తన వినియోగదారుల కోసం బుకింగ్ సంఖ్యను మార్చింది. మీరు Indane కస్టమర్ అయితే, ఇకమీదట మీరు సంస్థ ఇచ్చిన కొత్త నంబర్‌కు కాల్ చేసి గ్యాస్ బుకింగ్ చేసుకోవాలి. సంస్థ జారీ చేసిన కొత్త నెంబర్ 771895555 కు కాల్ చేయడం ద్వారా మీరు గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్ మెసెంజర్‌పై REFILL అని టైప్ చేసి 7588888824 కు పంపి బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా సులభమైన మార్గమే.

ప్రస్తుతం కస్టమర్లుకు సబ్సిడీ అందుబాటులో లేదు. గత 5 నెలలుగా, LPG సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదు. వాస్తవానికి, గ్యాస్ ధరలు గణనీయంగా తగ్గటమే ఇందుకు అసలు కారణం. దీనివల్లే మే నుండి అక్టోబర్ వరకు వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వలేదు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెల మొదటి తేదీన సమీక్షించబడుతుంది. అంటే, గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు నవంబర్ 1 న విడుదల అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version