ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ బీట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ కొందరు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.ఈ విషయంపై మాజీ మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. తాను బీట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు నిరూపించాలని ఆమె డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చకు వైసీపీ నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. అహోబిలంలో అక్రమంగా నిర్మిస్తున్న సత్రాలు, హోటళ్లకు తాను అనుమతించానని వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.అహోబిలం సర్పంచ్‌గా వైసీపీకి చెందిన వారే ఉన్నారని అఖిల ప్రియ గుర్తుచేశారు. ఎలాంటి నిర్మాణాలకైనా స్థానిక సర్పంచ్, గ్రామ పంచాయతీ తీర్మానాలు అవసరమనే విషయం కూడా వైసీపీ నాయకులకు తెలియదని విమర్శించారు. అహోబిలంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అందుకు వైసీపీ నేతలు రెడీనా అని భూమా అఖిల ప్రియా సవాల్ విసిరారు.