తిరుమల తిరుపతిలో ఘోర అపచారం చోటుచేసుకుంది. వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులు కొందరు దేవస్థానం పవిత్రతను మరిచి ప్రవర్తించారు. క్యూ లైన్లలో నిలబడిన భక్తుల్లో కాస్త అసహనం పెల్లుబికినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే కొందరు భక్తులు క్యూ లైన్లలో కొట్టుకున్నట్టు తెలుస్తోంది.తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల మధ్య గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. క్యూ లైన్లలో ఒకరినొకరు కొట్టుకోవడంతో ఆలయ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడంతో భక్తజనం శాంతించినట్లు సమాచారం. అయితే, గొడవకు దారితీసిన పరిణామాలపైనా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొట్టుకోడానికి తిరుమల అయితే ఏంటి..? తిరణాళ్లు అయితే ఏంటి..?
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల మధ్య గొడవ
ఒకరినొకరు కొట్టుకోవడంతో.. ఉద్రిక్తంగా మారిన ఆలయ ప్రాంగణం
సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడంతో శాంతించిన భక్తజనం#Tirumala #Tirupati #TempleFight #TirumalaTemple #TTD #AndhraPradesh pic.twitter.com/Q52QKeDXME
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 4, 2025