- లేదంటే తీవ్ర పరిణామాలు
- రైతు ఉద్యమానికి మద్ధతు ఉంటుంది
- కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : కేంద్రం ఇటీవల తీసుకుచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఉద్యమం ఉధృతం అవుతోంది. దీనికి ప్రతిపక్ష పార్టీలు అండగా నిలుస్తున్నాయి. వెంటనే ఆ మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రైతు ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చింరించారు.
తాజాగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ సరిహద్దులో కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరు సాగిస్తున్న అన్నదాతలకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు వెంటనే సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ చట్టాల వల్ల అన్నదాతకు ప్రయోజనాల కంటే అధిక నష్టాలను కలిగిస్తాయని తెలిపారు. వీటి ద్వారా దేశంలో మండీ వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుందని పేర్కొన్నారు.
రైతు సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందించే న్యాయస్థానాలకు వెల్లకుండా రైతులను ఈ చట్టాలు అడ్డుకుంటాయని తెలిపారు. ధరల గురించి కూడా పూర్తి వివరణ లేకపోవడంతో వాటిపై చర్చ అ
సాధ్యమని వివరించారు. ఇలా రైతులకు అనేక ఇబ్బందులను కలుగజేసే కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని తాము ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నమని వెల్లడించారు.