ప్రముఖ నటిగా, మోడల్ గా, డైరెక్టర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో భారీ పాపులారిటీ అందుకున్న రేణు దేశాయ్ (Renu Desai) పవన్ కళ్యాణ్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటూ పిల్లలతో ముంబైలో జీవిస్తోంది. వాస్తవానికి రేణు దేశాయ్ చాలా సౌమ్యురాలే కాదు సహృదయరాలు కూడా. ఎంతోమందికి సహాయం చేసిన గొప్ప మనసు ఆమెది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి దాదాపు పది సంవత్సరాలు గడుస్తోంది. కానీ తమ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అటు రేణు దేశాయ్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడు ప్రస్తావించలేదు.. ఇక తనపై వచ్చిన విమర్శలను రేణు దేశాయ్ ఖండిస్తోంది. కానీ అసలు ఏం జరిగింది అనే విషయం గురించి కూడా ఆమె మాట్లాడటం లేదు. కానీ పవన్ తో విడిపోయిన తర్వాత చాలా ఏళ్లకు తనను అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారని ధైర్యం వచ్చింది.. అంటూ సంచలనం రేపే పోస్ట్ పెట్టింది.
ఇకపోతే రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ పై సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి పవన్ కళ్యాణ్ గురించి తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ రేణు దేశాయ్ విషయానికీ వస్తే ఆమె ఎవరినో పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు రాగానే ట్రోలింగ్ మొదలుపెట్టారు.. పెళ్లి ఎలా చేసుకుంటావు నువ్వు మా వదినవి అంటూ పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ సహజీవనం చేసి ఒక బిడ్డను కనడానికి కూడా అంగీకరించింది. అలాంటి వ్యక్తిని ఆమె వదులుకునే అవకాశం లేదు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి అన్ని విధాలుగా చాలా సహాయ సహకారాలు అందించింది.
ఆరోజు రేణు దేశాయ్ నాకు కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు.. ఏ గుడిలో ఇంకెక్కడో పవన్ కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే పవన్ కి జైలు శిక్ష పడేది .. కానీ రేణు దేశాయ్ వల్లే పవన్ కళ్యాణ్ బయటపడ్డాడు అంటూ కృష్ణకుమారి పెను సంచలన వ్యాఖ్యలు చేశారు.