టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ క‌లిస్తే.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మేలు : ఎంపీ ర‌ఘురామ‌

-

జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయ ప్ర‌ముఖులు వ‌రుస‌గా స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ, టీడీపీ నాయ‌కుల‌తో పాటు అధికార వైసీపీ నాయ‌కులు, మంత్రులు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. తాజా గా వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీలిపోకుండా.. చూస్తామ‌న్న ప‌వ‌న్ వ్యాఖ్య‌లు వింటే బాధ వేస్తుంద‌ని అన్నారు.

కానీ నిజం చెప్పినందుకు సంతోషంగా ఉంద‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉద్ధేశం చూస్తే.. టీడీపీతో పోత్తు పెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తుంద‌ని అన్నారు. ప‌వన్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే.. బీజేపీతో పోత్తు పెట్టుకుంటున్నార‌ని అన్నారు. అయితే రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షంగా ఉన్న టీడీపీతో పోత్తు పెట్టుకుంటే.. జ‌న‌సేన‌, బీజేపీల‌కు కూడా క‌లిసి వ‌స్తుంద‌ని అన్నారు. అలాగే టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ క‌లిసి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తే.. ప్ర‌జ‌లకు కూడా మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news