తేజస్వి సీఎం అయితే ఆ రికార్డు సృష్టించినట్టే !

-

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 38 జిల్లాలలోని 55 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 3,755 అభ్యర్థుల భవితవ్యం ఈ మధ్యాహ్నానికి ఒక పట్టాన తేలనుంది. 69 ఏళ్ల సి.ఎమ్ నితీష్ కుమార్ పదవీచ్యుతుడు కానున్నట్లు “ఎగ్జిట్ పోల్స్” అంచనా వేస్తున్నాయి. అలానే 31 ఏళ్ల తేజస్వీ యాదవ్ కు బీహార్ ప్రజలు పట్టం కట్టనున్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే ఒక కుటుంబం నుండి ముఖ్యమంత్రిగా తండ్రి, తల్లి, ఇప్పుడు తనయుడు కూడా చేసిన అరుదైన రికార్డు నమోదు కానుంది.

అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరైనవో, కాదో నేడు మధ్యాహ్నం కల్లా తెలిపోనున్నాయి. అయితే అందరి చూపులు రాఘో పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పైనే ఉన్నాయి ఎందుకంటే వైశాలి జిల్లాలోని రాఘో పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తేజస్వీ యాదవ్ పోటీ చేశారు. ముందు నుండి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాఘో పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఇక తేజస్వీ అన్న తేజ్ ప్రతాప్ సమస్తిపూర్ జిల్లాలోని హసన్ పూర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో, తేజస్వీ యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీ దేవీ కూడా రాఘో పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించడంతో అక్కడ గెలవడం లాంచనమే.

Read more RELATED
Recommended to you

Latest news