రోజూ తలస్నానం చేస్తున్నారా? ఇది చదవండి ఓసారి

-

కొంతమందికి తలస్నానం చేస్తే గానీ.. స్నానం చేసినట్టు ఉండదు. ఏదో వెలితిగానే ఉంటుంది. తలస్నానం చేస్తేనే.. స్నానం చేసిన అనుభూతి కలుగుతుంది. అందుకే.. రోజూ తలస్నానం చేస్తుంటారు. తలస్నానం చేస్తే… రోజంతా ఫ్రెష్ గా ఉంటుందనుకుంటారు మరికొందరు. ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ.. రోజూ తలస్నానం చేయడం వల్ల ఏమౌతుందో తెలుసా?

జుట్టు రాలిపోతుందట. అవును.. నేడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. ముఖ్యంగా పెళ్లి కాని యువతీయువకులను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. కొంతమందికి బట్టతల వల్ల పెళ్లిళ్లు కూడా కావు. క్రమం తప్పకుండా హెడ్ బాత్ చేసేవాళ్లలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుందట. రకరకాల షాంపూలను వాడుతూ… హెడ్ బాత్ చేయడం వల్ల షాంపూల్లోని కెమికల్ వల్ల జుట్టు రాలే సమస్య అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అందుకే.. రోజూ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదని.. రోజూ హెడ్ బాత్ చేయకున్నా ఏంకాదని… వారానికి రెండు మూడు రోజులు హెడ్ బాత్ చేసినా సరిపోతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. లేదంటే.. షాంపూల వాడకం తగ్గించాలని… సహజసిద్ధమైన కుంకుడు కాయల లాంటి వాటిని జుట్టుకు వాడితే జుట్టు రాలడం సమస్య ఉండదని చెబుతున్నారు. రోజూ హెడ్ వాష్ వల్ల తల వెంట్రుకలు కూడా తడవడం… షెడ్ వాష్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక షాంపూ పెట్టుకోవడం.. ఇవే నెత్తి ఊడిపోవడానికి ప్రధాన కారణాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news