కేంద్రం 44లక్షల కోట్లు అప్పులు చేస్తే ఎందుకు ప్రశ్నించరు : అక్బరుద్దీన్

-

రాష్ట్రంలో అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే అన్నారు అక్బరుద్దీన్ ఒవైసీ. రాష్ట్రంలో అప్పులు పెరిగిన విషయం వాస్తమేనన్నారు. శ్వేత పత్రం విడుదల అసలు ఉద్దేశం చెప్పాలని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. అప్పుల వివరాలను ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు.  తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది అని ప్రశ్నించారు. తెలంగాణ దివాళా తీసిందని చెప్పడం సరికాదన్నారు. కర్ణాటక అప్పులను ప్రస్తావించారు. మీకు అనుకూలంగా ఉన్నవే మాట్లాడుతున్నారని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. రోజు వారి ఖర్చులకు కూడా డబ్బులు లేవని చెప్పడం వల్ల ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది. కర్ణాటక బడ్జెట్, కాగ్ లెక్కలు వేర్వేరుగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రభుత్వం రాంగ్ మెసెజ్ ఇవ్వకూడదన్నదే మా ఉద్దేశం అని చెప్పారు అక్బరుద్దీన్. సాధారణంగా అప్పులు చేయనిది పరిపాలన సాధ్యం కాదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా రూ.44లక్షల కోట్ల అప్పులు చేసిందని.. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అసెంబ్లీలో అక్బరుద్దీన్ చెప్పారు. 

Read more RELATED
Recommended to you

Latest news