కరోనా వస్తే కాళ్ళు ఇలా అయిపోతున్నాయా…?

-

అమెరికా మరియు యూరప్ దేశాలకు చెందిన చర్మ వ్యాధి నిపుణులు కరోనా వైరస్ లో కొత్త లక్షణాలను గుర్తిస్తున్నారు. కరోనా వైరస్ సోకినా పిల్లలకు కాలు మరియు, కాళ్ళ వాపు వస్తుందని గుర్తించారు. వారి కాలి అవయవాలు రంగు పాలిపోవడం కూడా గుర్తించారు. ముఖ్యంగా యువకుల్లో ఇది ఎక్కువగా ఉందని తేల్చారు. కఠిన శీతల ప్రదేశాల్లో జీవించే ప్రజల కాళ్ళు ఉన్న విధంగా ఈ లక్షణాలు ఉన్నాయి.

కాళ్ళకు దురదలు కూడా ఉంటాయని ఈ పరిస్థితి ఫ్రాస్ట్‌బైట్ లేదా పెర్నియో వంటిది అని తేల్చారు. అమెరికాలోని బోస్టన్ సహా పలు ప్రాంతాల్లో యువకుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా గుర్తించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ వైద్యులు ఇప్పుడు పిల్లలను గుర్తించి వారిని కరోనా వైరస్ పరిక్షలకు తరలిస్తున్నారు. ఇటలీలో, అలాంటి పిల్లలు ఎక్కడా ఇప్పటి వరకు కనపడలేదు. ఇప్పటి వరకు కరోనా లక్షణం అంటే,

తీవ్ర జలుబు, దగ్గు జ్వరం మాత్రమే అని అనుకున్నారు. కాని ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొత్త కొత్త లక్షణాలను గుర్తిస్తున్నారు. వాసన లేదా రుచిని ఆకస్మికంగా కోల్పోవడం లేదా గులాబీ కన్ను కలిగి ఉండటం ఇప్పుడు విలక్షణమైన లక్షణాలను గుర్తించారు. రాబోయే నెలల్లో ఇంకొన్ని లక్షణాలు ఇదే విధంగా బయటపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news