మనాలీలో విస్తారంగా కురుస్తున్న మంచు.. భారీగా ట్రాఫిక్ జామ్

-

శీతాకాలం కావడంతో ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీగా హిమపాతం కురుస్తోంది. అక్కడ క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఫలితంగా వాహనాలు మంచులో చిక్కుకుపోతున్నాయి.దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఇక మనాలీలో కురుస్తున్న మంచుకు సోలాంగ్ వ్యాలీ-పల్చాన్ మధ్య సుమారు 1,500 వాహనాలు చిక్కున్నాయి.

రోడ్లపై మంచు నిండిపోవడంతో 10 నుంచి 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాటిని క్లియర్ చేసేందుకు అక్కడి అధికారయంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నారు. హిమపాతం ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోతోంది. భానుడి కిరణాలు రాక ఎక్కడికక్కడ మంచు గుట్టలుగా పేరుకుపోతున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ మంచు వర్షం మరింత ఉధృతం కానుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైతం అలర్ట్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news