అమ్మో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్ ఎటు…?

-

ఒక అమెరికా కాంట్రాక్టర్ హత్య ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం తీసుకొచ్చింది. ఎప్పుడు ఎం జరుగుతుందో అర్ధం కాక అందరూ తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం ఇరాన్ టాప్ కమాండర్ జనరల్ ఖాసీం సులైమానిని అమెరికా బలగాలు అంతం చేసాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎం జరుగుతుందో అర్ధం కావడం లేదు. అమెరికా బలగాలు, ఇరాన్ సరిహద్దుల్లో మొహరించి యుద్ధం వస్తే ఘాటుగా స్పందించాలని భావిస్తున్నాయి.

ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే మాత్రం ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్ ఎటు వైపు మద్దతు ఇస్తుంది అనే ప్రశ్న పలువురి నుంచి వినపడుతుంది. వాస్తవానికి అమెరికా భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల అధినేతల నుంచి ప్రజల వరకు మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. అనేక ఒప్పందాలు కూడా ఇరు దేశాల మధ్య జరిగాయి కూడా. ఇరాన్ విషయానికి వస్తే భారత్ కి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ప్రధాన దేశం.

భారత్ తో మంచి సంబంధాలే ఆ దేశం కొనసాగిస్తుంది. అందులో ఆసియాలో భారత్ కి ఇరాన్ మంచి మిత్రుడు కూడా. ఈ నేపధ్యంలో ఇరాన్ అమెరికా యుద్ధం వస్తే భారత్ ఎవరికి మద్దతు ఇస్తుంది అనే ప్రశ్న వినపడుతుంది. ఆసియా దేశం కాబట్టి ఇరాన్ కి మద్దతు ఇస్తుందని అంటున్నా, అమెరికా అగ్ర రాజ్యం కాబట్టి తగువుకి భారత్ వెళ్లదని, అలా వెళితే ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలే అవకాశం ఉందని అంటున్నారు. ఇరాన్ కి మద్దతు ఇవ్వకపోతే చమురు విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రంప్ భారత్ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version