ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటమి రెండు ఉంటాయి అయితే ఎప్పుడు గెలుస్తామో ఎప్పుడు ఓడిపోతామో ఎవరు చెప్పలేము. కానీ చాలా మంది చేసే తప్పు ఏమిటంటే ఓటమి ఎదురవుతుందని భయపడుతూ అక్కడే ఆగిపోతూ ఉంటారు లేకపోతే ఓటమి ఎదురైన తర్వాత మళ్లీ ప్రయత్నించకుండా అలానే ఉండిపోతారు. మనం అనుకున్నప్పుడు ఏదైనా జరగకపోతే మనకి అసంతృప్తి కలుగుతుంది.. పైగా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఫలితం రావడం లేదని నిరాశ చెందుతారు చాలామంది. అలానే నా వలన కాదు.. నేను చేయలేను అని వెనకే ఉండిపోతారు. ఇటువంటి మనస్తత్వం ఉండకూడదు. దీని వలన ఓటమి తప్ప గెలుపు రాదు. మిమ్మల్ని మానసికంగా మరింత బలహీనమైన వ్యక్తిని చేసేస్తుంది ఇది.
ఎప్పుడూ కూడా సరైనదే కాదు. పాజిటివ్ గా ఉండడం మంచిది. నెగటివ్ గా ఉండడం వలన కనీస ప్రయత్నం కూడా చాలా మంది చేయలేరు ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే ముందుకు వెళ్లాలంటే ముందు మీరు దాని నుండి బయటికి వచ్చి మరో సారి ప్రయత్నం చేయండి ఏమో ఈసారి గెలవచ్చేమో… ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి.
ఓటమి వచ్చిన ప్రతిసారి కూడా నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని పక్కకు తోసేసి పాజిటివ్ గా ఉంటే కచ్చితంగా లైఫ్ లో ముందుకు వెళ్లగలము… అనుకున్నది సాధించగలము… అయితే ఇవన్నీ జరగాలంటే కాస్త ఓపికగా ఉండాలి. సమయం పడుతుంది ఎదురుచూడండి. మొదట మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎంత దూరమైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉండండి కచ్చితంగా గెలుపు మీ వెంట ఉంటుంది.