గొప్ప సినిమాలను ఆదరించే ప్రతి దేశంలో నటిస్తా.. హాలీవుడ్ ఎంట్రీ పై రామ్ చరణ్

-

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పేరు ప్రస్తుతం దేశమంతా మారు మోగిపోతుంది. ఇండియాతో పాటు హాలీవుడ్లో సైతం ఇతని పేరు గట్టిగానే వినిపిస్తుంది. త్వరలోనే ఆర్ఆర్అర్ సినిమా ఆస్కార్ గెలుచుకోనుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చరణ్ త్వరలోనే హాలీవుడ్ సినిమాల్లో నటించనున్నారని వార్తలు వినిపిస్తుండగా దీనిపై స్పందించాడు ఈ హీరో.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్అర్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటినకు అభిమానులంతా ఫిదా అయిపోయారు. ఇండియాతో పాటు అంతర్జాతీయంగా విమర్శకులు ప్రశంసల్ని అందుకున్నదీ సినిమా. తాజాగా ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా త్వరలోనే జరగనున్న ఆస్కార్ వేడుకల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆస్కార్ ప్రమోషన్ లో బిజీ బిజీగా గడుపుతున్న రామ్ చరణ్ హాలీవుడ్ ఛానల్ లకు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ సినిమాల్లో చరణ్ నటించినున్నారా అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ చరణ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎదిగే సమయం ఆసన్నమైందని చెప్పుకు వచ్చారు. అలాగే అంతర్జాతీయ ప్లాట్ ఫామ్ ఆస్కార్లో ఆర్ఆర్అర్ గుర్తింపు పొందటమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు. హాలీవుడ్ సినిమాల్లో నటించడంపై మాట్లాడిన ఈ హీరో కొన్ని హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయని.. మరో రెండు నెలల్లో గుడ్ న్యూస్ అందొచ్చని తెలిపారు. అలాగే గొప్ప సినిమాలను ఆదరించే ప్రతి దేశంలో తాను నటించటానికి సిద్ధమేనని చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version